దారుణం: కర్రతో కొట్టి వియ్యంకుడి హత్య | Man Murdered In Nizamabad Over Family Disputes | Sakshi
Sakshi News home page

దారుణం: కర్రతో కొట్టి వియ్యంకుడి హత్య

May 4 2020 10:36 AM | Updated on May 4 2020 10:36 AM

Man Murdered In Nizamabad Over Family Disputes - Sakshi

సాక్షి, కమ్మర్‌పల్లి(నిజామాబాద్‌) : కూతురిని పుట్టింటికి పంపించనందుకు వియ్యంకుడిని కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహ్మద్‌ ఆసిఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం దూంపేటకు చెందిన బోదాసు రాజెం కమ్మర్‌పల్లి హాసాకొత్తూర్‌లోని మారుతినగర్‌లో నివాసముండే తన కూతురు ఇరుగదిండ్ల నీలా ఇంటికి శనివారం వెళ్లాడు. తన కూతురిని పుట్టింటికి తీసుకెళ్తానని వియ్యంకుడు ఇరగదిండ్ల రాములు(45), వియ్యంకురాలు రేణుకను కోరాడు. కొడుకు ఇంట్లో లేడని, వచ్చిన తర్వాత తీసుకెళ్లాలని చెప్పారు. (ఆ గ్రీన్‌జోన్‌లో 21 మందికి కరోనా పాజిటివ్‌! )

దీంతో కోపోద్రిక్తుడైన బోదాడు రాజెం వారిని బెదిరిస్తూ కూతురుని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. రాములు అతని భార్య అడ్డు చెప్పగా గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో రాజెం అక్కడే ఉన్న కర్రతో రాములును మోచాడు. తలకు బలమైన గాయం కావడంతో కింద పడిపోయాడు. కొడుకు మిరేష్‌ ఘటనా స్థలానికి చేరుకొని తండడ్రిని నిజామాబాద్‌ ఆస్పతత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాములు మరణించాడు. మిరేష్‌ ఫిర్యాదు మేరకు బోదాసు రాజెంపై హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. (కరోనా వ్యాక్సిన్‌.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement