వృద్ధురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్‌ | Man Molestation On Elderly Woman YSR Kadapa | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్‌

Oct 23 2018 2:13 PM | Updated on Oct 23 2018 2:13 PM

Man Molestation On Elderly Woman YSR Kadapa - Sakshi

నిందితుని వివరాలను వెల్లడిస్తున్న సీఐ రమేష్‌బాబు

వైఎస్‌ఆర్‌ జిల్లా, బద్వేలు అర్బన్‌ : తప్పతాగి వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన కాక ర్లసిద్దయ్య అనే వ్యక్తిని సోమవారం అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక అర్బన్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బద్వేలు అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ సీఐ ఎం.రమేష్‌బాబు నిందితుని వివరాలు వెల్లడించారు. మైదుకూరురోడ్డులోని దివ్యజ్యోతి వృద్ధాశ్రమంలో ఏడాది నుంచి 80 ఏళ్ల వృద్ధురాలు ఉంటోంది. అయితే వృద్ధాశ్రమం సమీపంలోనే ఉంటున్న కాకర్ల సిద్దయ్య అనే వ్యక్తి వృద్ధురాలిపై కన్నేశాడు.

ఈ నెల 19న వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో సిద్దయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న వృద్ధురాలు కుమార్తె అయిన సరోజమ్మ అర్బన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మైదుకూరురోడ్డులోని వీరారెడ్డి కళాశాల ఎదురుగా ఉన్న నాయుడు హోటల్‌ వద్ద నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అర్బన్‌ ఎస్‌ఐ చలపతినాయుడు, హెడ్‌కానిస్టేబుల్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement