వివాహేతర సంబంధం.. భార్యపై భర్త దాడి | man knife attacks on wife.. | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. భార్యపై భర్త దాడి

Jan 31 2018 11:48 AM | Updated on Aug 21 2018 5:52 PM

సాక్షి, పెద్దపల్లి: భార్య వేరొకరితో సంబంధం కలిగి ఉండటాన్ని సహించలేని ఓ భర్త ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్‌ కాలనీలో జరిగింది. శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన భార్య స్వరూప వేరొకరితో సంబంధం కలిగి ఉండగా కళ్ళారా చూశాడు. ఇది తట్టుకోలేక ఆగ్రహంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం శ్రీనివాస్‌ పోలీసులకు లొంగిపోయాడు. 

Advertisement
 
Advertisement
Advertisement