
సాక్షి, విజయవాడ: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంకమ్మ తల్లి ఆలయం సమీపంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు దాటుతున్న వ్యక్తిని గన్నవరం వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో గాల్లోకి ఎగిన పడిన వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పటమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.