బీమా డబ్బుల కోసం బామ్మర్ది హత్య!

Man found murdered on cops suspect brother-in-law - Sakshi

భిక్కనూరు: రైతుబీమా డబ్బుల కోసం సొంత బామ్మర్దినే హత్య చేశాడంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శనివారం ఆగ్రహోదగ్రులయ్యారు. బావతో పాటు మరో ఇద్దరు నిందితుల ఇళ్లను ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన శేఖర్‌ (21) రామాయంపేట శివారులోని ఓ బావిలో శుక్రవారం శవమై కనిపించాడు. అతడి మృతికి బావ రాజశేఖరే కారణమని కుటుంబ సభ్యులు, స్థానికులు శనివారం గ్రామంలో ఆందోళనకు దిగారు. వారి ఇళ్లపై దాడి చేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఆందోళన విరమించాలని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. బీమా డబ్బుల కోసమే శేఖర్‌ను అతని బావ రాజశేఖర్, మరో ఇద్దరు కలసి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top