కొంపముంచిన అలవాటు

Man Dead After Fall From Apartment In Vizianagaram - Sakshi

అపార్ట్‌మెంట్‌ నుంచి కిందకు పడి వ్యక్తి మృతి

విజయనగరం క్రైం: నిద్రలో నడిచే అలవాటు వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకోగా.. వన్‌టౌన్‌ పోలీసులు శనివారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక  చైతన్య పబ్లిక్‌ స్కూల్‌ దగ్గరలో ఉన్న రత్నం మోజో అపార్ట్‌మెంట్‌ ఐదో ఫ్లోర్‌లో జి.పవన్‌కుమార్‌ (25) నివాసముంటున్నాడు. ఇతనికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. శుక్రవారం రాత్రి అపార్ట్‌మెంట్‌లో పడుకున్న ఈయన అర్ధరాత్రి తర్వాత నిద్రలోనే పెద్దగా కేకలు వేసుకుంటూ ఐదో ఫ్లోర్‌ నుంచి కిందకు పడి సంఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై వి.  శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top