ఆ కామాంధుడికి పదేళ్ల జైలుశిక్ష | Man Convicted In Rape Case Got Ten Years Sentence In Tamilnadu | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం.. పదేళ్ల జైలుశిక్ష

Apr 30 2019 9:03 AM | Updated on Apr 30 2019 9:06 AM

Man Convicted In Rape Case Got Ten Years Sentence In Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

2017 జనవరి 23న ఎనిమిదేళ్ల కుమార్తె ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన ఆంథోని బాలికను సమీపంలోని పాడుబడిన ఇంటికి...

సాక్షి, చెన్నై : ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు, 5వేల రూపాయల జరిమానా విధిస్తూ తిరువళ్లూరు మహిళా కోర్టు తీర్పు  వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని ముత్తాపుదుపేట గ్రామానికి చెందిన మోసస్‌ ప్రసన్న దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో 2017 జనవరి 23న ఎనిమిదేళ్ల కుమార్తె ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన ఆంథోని బాలికను సమీపంలోని పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలి పెట్టాడు.

ఈ క్రమంలో ఏడుస్తూ ఇంటికి వచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కామాంధుడిపై ఆవడి మహిళా పోలీసు స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసు విచారణ తిరువళ్లూరు మహిళ కోర్టులో సాగింది. విచారణలో నిందితుడు బాలికపై అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో ఆంథోనికి పదేళ్ల  జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సెల్వనాథన్‌ తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు జైలు శిక్షను అనుభవించాలన్నారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో నిందితుడిని పోలీసులు పుళల్‌ జైలుకు తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement