డమ్మీ తుపాకీతో తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్‌ | Man Arrest In Carrying Fake Gun Ananthapur | Sakshi
Sakshi News home page

డమ్మీ తుపాకీతో తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్‌

May 26 2018 9:18 AM | Updated on Jun 1 2018 8:39 PM

Man Arrest In Carrying Fake Gun Ananthapur - Sakshi

డమ్మీ తుపాకీని చూపుతున్న సీఐ

ధర్మవరం అర్బన్‌: డమ్మీ తుపాకీతో బ్యాంకులో తిరుగుతున్న వ్యక్తిని ధర్మవరం పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ హరినాథ్‌ శుక్రవారం రాత్రి మీడియాకు వివరించారు. బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామానికి చెందిన టి.హరికృష్ణ బెంగళూరులో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ధర్మవరంలోని మార్కెట్‌ వీధిలో గల ఒక బ్యాంకులో డమ్మీ తుపాకీతో హరికృష్ణ తిరుగుతుండటంతో సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీతో ఎవరినైనా బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేయడానికా.. లేక ఇంకేదైనా కారణముందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement