ప్రేమజంట ఆత్మహత్యాయత్నం | Love Couples Commits Sucide In Prakasam | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Jul 18 2018 12:37 PM | Updated on Jul 18 2018 12:37 PM

Love Couples Commits Sucide In Prakasam - Sakshi

మాట్లాడుకుంటున్న ఇరు పక్షాలకు చెందిన పెద్దలు

చీరాల రూరల్‌ : పెద్దలు తమ పెళ్లి నిరాకరించారని మనస్తాపంతో ఓ ప్రేమజంట పురుగులమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఈ సంఘటన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మండల పరిధిలోని పిట్టువారిపాలెంకు చెందిన ధర్మరాజు, 300 కాలనీకి చెందిన రాధ కావూరిపాలెంలోని ఓ రొయ్యల కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంలేదు. దీంతో ఇద్దరు పురుగులమందు కొనుగోలు చేసి సేవించారు.

అనంతరం రాధ నివాసముండే కాలనీకి వచ్చి జరిగిన విషయం చెప్పారు. దీంతో ఇద్దరిని 108 వాహనంలో చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ఇరువురికి చికిత్సలు చేయడంతో యధాస్థితికి వచ్చారు. ఇదిలా ఉండగా ధర్మరాజు మాత్రం ఆమెను నేను ప్రేమించడం లేదని, ఆమె తనను ప్రేమిస్తున్నానని వెంటపడుతుండేదని తెలిపాడు. అయితే రాధ మాత్రం అతడే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడని, తనకు న్యాయం చేయాలని వేడుకొంటుంది. రంగంలోకి దిగిన పెద్దలు సరిచేసే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement