దాణా కుంభకోణంలో తుది తీర్పు వెల్లడి | Lalu sentenced to 3.5 years jail | Sakshi
Sakshi News home page

లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష

Jan 6 2018 4:29 PM | Updated on Jan 6 2018 4:42 PM

Lalu sentenced to 3.5 years jail  - Sakshi

రాంచీ :  దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు శనివారం తుది తీర్పు వెల్లడించింది. రాంచీ సీబీఐ కోర్టు... బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మూడున్నరేళ్లు జైలుశిక్ష, ఐదు లక్షల జరిమానా విధించింది. దియోగర్‌ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు దోషులకు మూడున్నరేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. బిర్సా ముండా జైలులో ఉంటున్న లాలూను.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయస్థానం విచారణ చేసింది. అయితే అనారోగ్యం, వయోభారం దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో తనకు తక్కువ శిక్ష విధించాలని లాలూ నిన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తికి విజ‍్ఞప్తి చేసిన విషయం విదితమే. మరోవైపు లాలూకు జైలు శిక్షపై ఆయన తనయుడు తేజస్వి యాదవ్‌ స్పందించారు. చట్టం తన పని తాను చేసిందని, సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement