కి‘లేడీ’ రిమాండ్‌ | lady remand in theft case | Sakshi
Sakshi News home page

కి‘లేడీ’ రిమాండ్‌

Feb 28 2018 7:47 AM | Updated on Nov 6 2018 4:04 PM

lady remand in theft case - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సిరిసిల్లక్రైం: ప్రయాణికుల నుంచి డబ్బులు, నగదు చోరీచేసిన మహిళను సిరిసిల్ల సీసీఎస్‌ పోలీసులు మంగళవారం రిమాండ్‌ చేశారు. ఏఎస్పీ రవీంద ర్‌ తెలిపిన ప్రకారం.. కృష్ణాజిల్లా ఆత్రేయపురంకు చెందిన తాటపట్టి నర్సమ్మ తన సోదరుడితో కలిసి సిరిసిల్ల, వేములవాడ బస్టాండుకు వచ్చిన ప్రయాణికుల నుంచి వస్తువులు, ఆభరణాలు, నగదు చోరీ చేసింది.

ఏడేళ్లకాలంలో వీరు రూ. 1.78 లక్షలు, 15తులాల బంగారం అపహరించారు. డబ్బులను అవసరాలకు ఖర్చు చేశారు. బంగారాన్ని వేములవాడలోని వారుంటున్న ప్రదేశంలో భద్రంగా ఉంచారు. వాటిని అమ్ముకునేందుకు మంగళవారం స్వగ్రామం బయల్దేరారు.  పక్కా సమాచారంతో సిరిసిల్ల పాత బస్టాండ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో సీసీఎస్‌ సీఐ బన్సీలాల్‌ ఉన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement