కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి | Kanna Laxminarayana daughter in law Departed Self | Sakshi
Sakshi News home page

కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి

May 28 2020 7:30 PM | Updated on May 28 2020 8:57 PM

Kanna Laxminarayana daughter in law Departed Self - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మాదాపూర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మీనాక్షి టవర్స్‌లో గురువారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కోడలు మృతితో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతికి గల కారణాలు తెలియనున్నాయి. సుహారిక తల్లి, భర్త ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement