బాలుడిపై అత్యాచారం; స్టార్‌ హీరోయిన్‌ హెయిర్‌స్టైలిస్ట్‌ అరెస్ట్‌

Kangana Ranaut Hair Stylist Arrested - Sakshi

ముంబై : పదహారేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కంగనా రనౌత్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌ బ్రెండన్‌ అలెస్టర్‌ డీగీ(42)ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కంగనా రనౌత్‌ అప్‌కమింగ్‌ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం.. మహారాష్ట్రలోని రాయగఢ్‌లో జరుగుతోంది. బ్రెండన్‌ కూడా అక్కడే ఉండటంతో ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద బ్రెండన్‌పై కేసు నమోదు చేసి, అక్టోబర్‌ 3 వరకు రిమాండ్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. సౌతాఫ్రికాకు చెందిన బ్రెండన్‌ కంగనాతో పాటుగా పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలకు హెయిర్‌స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.

కాగా డేటింగ్‌ ఆప్‌లో తన వయస్సును తప్పుగా పేర్కొన్న సదరు బాలుడు పలువురు సెలబ్రిటీల(పురుషులు)తో స్నేహం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన అతడి తల్లి తన కుమారుడితో సంబంధాలు కలిగి ఉన్న ఎనిమిది మంది వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిలో బ్రెండన్‌ కూడా ఉండటంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top