వింత కేసు.. ‘నీ గదిలో బాత్‌రూం ఉందిగా’.. | Husband Refuses Wife To Use His Bathroom She Abuses And Threatens Him | Sakshi
Sakshi News home page

బాత్‌రూం కోసం భార్యాభర్తల గొడవ!

Mar 14 2020 10:51 AM | Updated on Mar 14 2020 11:05 AM

Husband Refuses Wife To Use His Bathroom She Abuses And Threatens Him - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అహ్మదాబాద్‌ : తన బాత్‌రూంలో స్నానం చేయటానికి వద్దన్న కారణంగా భార్య బూతులు తిట్టిందని, బెదిరించిందని ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ వింత సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అహ్మదాబాద్‌కు చెందిన గాంధీ అనే వ్యక్తి ట్రావెల్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ ఉదయం ఆఫీసుకు వెళ్లడానికి తయారై తన రూములో సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో అతడి భార్య జూలీ అక్కడికి వచ్చింది. స్నానం చేయటానికి బాత్‌రూమ్‌ను ఉపయోగించుకుంటానని అతడిని అడిగింది. అయితే గాంధీ ఇందుకు ఒప్పుకోలేదు. ( గొంతునులిమి చంపి.. శవంతో శృంగారం )

‘నీ గదిలో బాత్‌రూం ఉందిగా. ఇక్కడికెందుకు వచ్చావ్‌?’ అని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ఆమె అతడ్ని బూతులు తిట్టింది, కేసు పెడతానని బెదిరించింది. దీంతో భయపడ్డ గాంధీ తనే పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ( బస్సులో మంటలు.. అందరూ చూస్తుండగానే.. )

చదవండి : 'మద్యం తాగించి నాపై అత్యాచారం చేశాడు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement