బస్సులో మంటలు.. అందరూ చూస్తుండగానే.. | Fire Broke Into Travel Bus In Sangareddy | Sakshi
Sakshi News home page

బస్సులో మంటలు.. అందరూ చూస్తుండగానే..

Mar 13 2020 9:32 AM | Updated on Mar 13 2020 10:01 AM

Fire Broke Into Travel Bus In Sangareddy - Sakshi

మంటల్లో కాలుతున్న ట్రావెల్‌ బస్సు

హైదరాబాద్‌ వస్తున్న ఆరెంట్‌ ట్రావెల్‌ బస్సులో ఒక్కసారిగా...

సాక్షి, సంగారెడ్డి : రామచంద్రాపురం జాతీయ రహదారిపై ఆగిఉన్న ఓ ట్రావెల్‌ బస్సులో మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే బస్సు మంటలకు ఆహుతైంది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ముంబైనుంచి హైదరాబాద్‌ వస్తున్న ఆరెంట్‌ ట్రావెల్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన డ్రైవర్‌ రామచం‍ద్రాపురం జాతీయ రహదారిపై గల హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ పక్కన బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దింపేశాడు. ఆ వెంటనే బస్సు అందరూ చూస్తుండగానే మంటల్లో కాలిపోయింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26మంది ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ అప్రమత్త కారణంగా పెను ప్రమాదం తప్పింది. అయితే బస్సులోని ప్రయాణికుల సామాన్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement