
సాక్షి, మహబూబ్‌ననగర్: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో రూ.100 కోట్లు, గద్వాల జిల్లాలోని అయిజ మున్సిపాలిటీలో రూ.81 లక్షల మేర అవినీతి జరిగిందంటూ న్యాయవాది ప్రవీణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో గద్వాల్ పోలీస్ స్టేషన్‌లో తహసీల్దార్ ఫిర్యాదు చేశారని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై హైకోర్టు స్పందిస్తూ గద్వాల కలెక్టర్ రంజిత్ కుమార్, ఎస్పీ విజయ్‌కుమార్, మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, దీనిని ఎందుకు జాప్యం చేస్తోందంటూ ఏసీబీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్‌ను ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది.