ఇన్నోవాను ఆటోతో ఓవర్‌టెక్‌ చేశాడని.. | Group of friends attacks Auto driver in Chandanagar | Sakshi
Sakshi News home page

ఇన్నోవాను ఆటోతో ఓవర్‌టెక్‌ చేశాడని..

Aug 21 2018 11:24 AM | Updated on Aug 21 2018 11:53 AM

Group of friends attacks Auto driver in Chandanagar - Sakshi

కారుని ఓవర్‌ టేక్‌ చేశాడని ఆటోడ్రైవర్‌ను తీవ్రంగా కొట్టి, చనిపోయాడని భావించి...

సాక్షి, హైదరాబాద్‌ : కారుని ఓవర్ టేక్ చేశాడనే కోపంతో ఆటో డ్రైవర్‌ని నిర్బంధించి చితక బాదిన ఘటన చందానగర్‌లో చోటుచేసుకుంది. గౌలిదొడ్డి గ్రామానికి చెందిన రమేష్ తన మిత్రుడుతో కలిసి నల్లగండ్ల పెట్రోల్ బంకు వైపు వెళ్తున్నారు. అదే వైపు ఇన్నోవా కారులో కొంతమంది యువకులు వెళ్తున్నారు. కారుని ఆటోతో ఓవర్ టేక్ చేశాడనే కోపంతో చేజ్‌ చేసి ఆటోను అడ్డగించారు. 

అంతటితో ఆగకుండా రమేష్‌ను కారులో కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్లి మరికొంతమంది యువకులతో కలిసి తీవ్రంగా కొట్టారు. దీంతో రమేష్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడని వదిలి పెట్టి పోయారు. మూడు రోజులు క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రమేష్‌కు చికిత్స అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement