కుమారుడి పెళ్లి వేడుకలో.. తండ్రి హత్య!

Grooms Father Gets shot In Pre Wedding Celebrations In Maharashtra - Sakshi

ముంబై: వారంలో రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి.. కుటుంబమంతా ఆ వేడుకల్లో ఆనందంగా ఉంది. అయితే  పెల్లి వేడుకల్లో భాగంగా జరిపిన కాల్పుల్లో  ఇంటిపెద్ద మృతి చెందిన ఘటన ఆ కుటుంబాన్ని షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్‌ ఉజ్జయిన్‌ జిల్లాకు చెందిన విక్రమ్‌ సింగ్‌(47)  కుమారుడు రంజిత్‌ సింగ్‌ వివాహం కుదిరింది. ఇందులో భాగంగా ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బంధువులు, స్నేహితులతో కలిసి కుటుంబమంతా జంగోతి గ్రామంలోని ఓ ఆలయానికి వెళ్లారు. అందరూ ఆలయంలోకి వెళుతున్న సమయంలో తుపాకీతో మూడుసార్లు కాల్పులు జరిపారు. అందులోని చివరి బుల్లెట్‌ విక్రమ్‌ సింగ్‌ ఛాతీలోకి దూసుకువెళ్లింది. దాంతో అతడిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విక్రమ్‌ సింగ్‌ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. 

కుటుంబ సభ్యులు సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుల్లెట్‌ విక్రమ్‌ సింగ్‌ ఛాతి భాగంలో తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించాల్సి ఉందని అడిషినల్‌ ఎస్పీ అంటార్‌ సింగ్‌ కనేష్‌ తెలిపారు. అయితే విక్రమ్‌ సింగ్‌ను టార్గెట్‌ చేసుకునే కాల్పులు జరిపారా, లేక అనుకోకుండా బుల్లెట్‌ తగిలిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top