మరికొద్ది గంటల్లో పెళ్లి..వరుడు అదృశ్యం | Groom Missing In Karnataka | Sakshi
Sakshi News home page

వరుడు అదృశ్యం

Jun 18 2018 8:55 AM | Updated on Jun 18 2018 8:55 AM

Groom Missing In Karnataka - Sakshi

తుమకూరు: మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు హఠాత్తుగా కనిపించక పోవడంతో వివాహం అర్ధాంతరంగా రద్దయిన ఘటన ఆదివారం జిల్లాలోని కుణిగల్‌ తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కల్లేగౌడనదొడ్డికి చెందిన శివకుమార్‌కు బిళిదేవాలయ గ్రామానికి చెందిన భైరప్ప అనే వ్యక్తి కుమార్తెతో వివాహం నిశ్చయించారు.

ఈ క్రమంలో శనివారం శాస్త్రోత్తమ కార్యక్రమాల్లో పాల్గొన్న శివకుమార్‌ ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు.వి వాహ సమయం సమీపిస్తున్నా శివకుమార్‌ పెళ్లిమంటపానికి చేరుకోకపోవడంతో ఇరు వర్గాల బంధువులు వరుడి కోసం వెతికినా ఫలితం లేదు. దీంతో వివాహం అర్ధాంతరంగా రద్దయింది. దీంతో వధువు తల్లితండ్రులు వరుడితో పాటు వరుడి తల్లితండ్రులపై ఫిర్యాదు చేయడంతో అమృతూరు పోలీసులు కేసు నమోదు  చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement