కనుగుడ్లు పీకి, మొహంచెక్కి బాలిక దారుణ హత్య | Girl Brutally Murdered In Medchal | Sakshi
Sakshi News home page

కనుగుడ్లు పీకి, మొహంచెక్కి బాలిక దారుణ హత్య

Jul 20 2019 1:48 PM | Updated on Jul 20 2019 1:50 PM

Girl Brutally Murdered In Medchal - Sakshi

సాక్షి, మేడ్చల్‌: మేడ్చల్‌లోని ఓ బస్తీలో దారుణం చోటుచేసుకుంది. బస్తీ సమీపంలో గోనెసంచిలో 14 ఏళ్ల ఓ బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక గొంతుకోసి, ఆనవాళ్లు గుర్తించకుండా కనుగుడ్లు పీకి, మొహంచెక్కి అత్యంత కిరాతకంగా హతమార్చారు. అనంతరం గోనెసంచిలో కుక్కి.. సమీపంలోని చెత్తకుండిలో పడేశారు.

స్థానికుల సమాచారం మేరకు మేడ్చల్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గోనెసంచిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొహంపై యాసిడ్ పోసినట్లు కూడా పోలీసులు తెలిపారు. బాలికను ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? లేక ఆమె స్థానికురాలేనా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement