బాత్‌ రూమ్‌లో శవాలై తేలారు | Ghaziabad Couple Suspicious Death Found in Bathroom | Sakshi
Sakshi News home page

Mar 4 2018 1:57 PM | Updated on Jul 10 2019 7:55 PM

Ghaziabad Couple Suspicious Death Found in Bathroom - Sakshi

నీరజ్‌-రుచి దంపతుల ఫోటో

ఘజియాబాద్‌ : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెదంటం కలకలం రేపింది. గ్యాన్‌ చంద్‌ ప్రాంతంలో హోలీ వేడుకల్లో పాల్గొన్న జంట.. తర్వాత బాత్రూమ్‌లో శవాలై కనిపించింది. 

ఇందిరాపురానికి చెందిన నీరజ్‌ సింఘానియాకు నాలుగేళ్ల క్రితం రుచితో వివాహం జరిగింది. శనివారం రాత్రి బాత్రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నారు. కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

ఆపై బంధవులు తమకు సమాచారం ఇచ్చారని ఎస్పీ హెచ్‌ఎన్‌ సింగ్‌ తెలిపారు. హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆ జంట గదిలోకి వెళ్లి తిరిగి రాలేదని నీరజ్‌ తండ్రి ప్రేమ్‌ ప్రకాశ్‌ చెబుతున్నారు. 

మృతదేహాలను పోస్ట్‌ మార్టానికి పంపిన పోలీసులు నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటిదాకా ఫిర్యాదులు అందలేదని పోలీసులు చెబుతున్నారు.

పసిపాపపై దాష్టీకం

Advertisement
 
Advertisement
Advertisement