ఘాతుకం.. చావు బతుకుల్లో చిన్నారి | Child Battles Life After Uncle Raped Her in Lucknow | Sakshi
Sakshi News home page

Mar 3 2018 7:28 PM | Updated on Mar 3 2018 7:28 PM

Child Battles Life After Uncle Raped Her in Lucknow - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ లో దారుణం చోటు చేసుకుంది. సొంత బాబాయే ఓ పసిపాపపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ మృగం చేతిలో చితికిన చిన్నారి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 

థాకూర్‌గంజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నో నగర్‌ నిగమ్‌ ప్రాంతానికి చెందిన చిన్నారి తండ్రి కూలీ పనులు చేసుకుంటున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నాడు. అతని సోదరుడు(20) హోలీ సందర్భంగా ఇంటికి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఆ యువకుడు తన వెంట తీసుకెళ్లాడు. ఓ పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

ఘటన తర్వాత పారిపోతున్న యువకుడిని గమనించిన స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పాపను కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో చేర్పించి చికిత్స అందజేయిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో శస్త్ర చికిత్స అవసరమైందని.. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోక్సో చట్టం ప్రకారం నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement