రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం | Four killed in bangalore road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

May 2 2019 8:55 AM | Updated on May 2 2019 11:12 AM

Four killed in bangalore road accident - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు రూరల్‌ మండలానికి చెందిన మోహన్‌ నాయుడు కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటకలో ధర్మస్థల స్వామివారి దర్శనానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బెంగళూరు జాతీయ రహదారిపై అదుపు తప్పి మరో లారీని ఢీకొంది. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో మోహన్‌ నాయుడుతో పాటు ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ఆయన తండ్రి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వారిని బెంగళూరుకు తరలించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement