చేపల వ్యాపారి దారుణ హత్య | Fish Trader murdered in Jubilee Hills | Sakshi
Sakshi News home page

చేపల వ్యాపారి దారుణ హత్య

Feb 4 2020 8:46 PM | Updated on Feb 5 2020 10:24 AM

Fish Trader murdered in Jubilee Hills - Sakshi

సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పీఎస్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో చేపల వ్యాపారి రమేష్‌ దారుణ హత్యకు గురయ్యారు. రెండు రోజుల క్రితం రమేష్‌ను దుండగులు కిడ్నాప్‌ చేసి రూ. 90 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులని ఆశ్రయించారు. ఇంతలోనే రమేష్‌ను దుండగులు హత్య చేసి మూటకట్టారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి  తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement