తృటిలో తప్పిన ప్రమాదం | fire in car at Horsley Hills | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన ప్రమాదం

Jan 20 2018 5:44 PM | Updated on Sep 5 2018 9:47 PM

సాక్షి, హార్సిలీహిల్స్‌: పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. రేణుమాను మిట్ట వద్ద కారు దగ్దమైన సంఘటన జరిగింది. కడప నుంచి హార్సిలీహిల్స్ కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో కారులో తొమ్మిదిమంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పొగలు రావడంతో గమనించి అందులోని వారు కిందకు దిగిపోయారు. వెంటనే మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. బాధితుడు కడపకు చెందిన బంగారు షాపు యజమాని మహమ్మద్ గా తెలుస్తోంది. పర్యాటక కేంద్రం సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారమందించగా వారు వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement