షూటింగ్‌ సెట్‌లో అగ్నిప్రమాదం  | Fire Accident In Movie Shooting Set Perambur Tamil Nadu | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ సెట్‌లో అగ్నిప్రమాదం 

Feb 29 2020 9:23 AM | Updated on Feb 29 2020 9:48 AM

Fire Accident In Movie Shooting Set Perambur Tamil Nadu - Sakshi

పెరంబూరు: షూటింగ్‌ సెట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా రూ.20 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాలు..  స్థానిక సాలిగ్రామం, వేలాయుధం కాలనీలో పారామౌంట్‌ అనే స్టూడియో ఉంది. అక్కడ సినిమా, టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లను నిర్వహిస్తుంటారు. అందుకు అవసరం అయిన ఇళ్లు, భవనం వంటి సెట్స్‌ను పర్మినెంట్‌గా ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం పారామౌంట్‌ స్టూడియో వెనుక భాగంలో ఉన్న సినిమా సెట్‌కు సంబంధించిన వస్తువుల నుంచి వచ్చిన పొగ రానురానూ పెద్దదై మంటలు చెలరేగాయి. 

ఈ విషయాన్ని గమనించిన వాచ్‌మెన్‌ వెంటనే అగ్నిమాపక దళ కార్యాలయానికి ఫోన్‌ చేసి సమాచారాన్ని అందించాడు. కోయంబేడు, అశోక్‌నగర్‌ నుంచి రెండు అగ్నిమాపక దళాలు, రెండు నీటి ట్యాంకర్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ క్రమంలో రెండు గంటల తర్వాత మంటలను ఆర్పగలిగారు. అయితే అప్పటికే అక్కడ వేసిన సెట్, సామాన్లు, ఒక వృక్షం మంటలకు ఆహుతైనట్టు నిర్వాహకులు తెలిపారు. సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement