అక్క బదులు చెల్లెలు.. పోలీసులకు ఫిర్యాదు | FIR Booked Against Woman For Impersonating Her Sister To Write Exam | Sakshi
Sakshi News home page

నకిలీ సర్టిఫికెట్లతో.. 

Dec 27 2019 2:14 PM | Updated on Dec 27 2019 2:17 PM

FIR Booked Against Woman For Impersonating Her Sister To Write Exam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

టీ.నగర్(చెన్నై)‌: అక్క కోసం పరీక్ష రాసిన చెల్లెలిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. వివరాలు.. మదురైకు చెందిన మీనాక్షి గత 3 ఫిబ్రవరి 2019లో తిరుచ్చి అరియమంగళంలోని ఎస్‌ఐటీ కళాశాలలో జరిగిన ఇంగ్లీష్‌ షార్ట్‌హ్యాండ్‌ పరీక్ష రాశారు. అయితే దీనిపై పలు ఫిర్యాదులు అందడంతో తిరుచ్చి అరియమంగళం పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణలో ఆంగ్లం షార్ట్‌హ్యాండ్‌ పరీక్ష రాసేందుకు మదురైకు చెందిన రామలక్ష్మి దరఖాస్తు చేసుకున్నారు. 

ఆమెకు పరీక్ష సమయంలో అనారోగ్యం ఏర్పడడంతో ఆమె సోదరి మీనాక్షి పరీక్ష రాసేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం ఆమె నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి, హాల్‌టిక్కెట్‌లో తన ఫొటో అతికించి అక్రమాలకు పాల్పడింది. కొన్ని రోజుల క్రిందట మీనాక్షి తన స్నేహితురాళ్లతో అక్రమంగా పరీక్ష రాసినట్లు తెలిపింది. ఆమె స్నేహితురాళ్లు తమ సన్నిహితులతో చెప్పడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీనిగురించి షార్ట్‌హ్యాండ్‌ పరీక్ష నిర్వహించిన విద్యాసంస్థ తరపున తిరుచ్చి అరియమంగళం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement