హైదరాబాద్‌లో పరువు హత్య

హైదరబాద్: నగరంలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓ వ్యక్తి తన కూతురి గొంతుకోసి దారుణంగా చంపాడు. నాలుగేళ్ల క్రితం వరసకు బాబాయి అయ్యే వ్యక్తిని విజయ అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె అత్త చనిపోవడంతో ఈ నడుమ తిరిగి ఇంటికి వచ్చింది.
వరసకు బాబాయి అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకుని తన పరువు తీశావంటూ తండ్రి ఆమెను గొంతు కోసి చంపి అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి