పిల్లలకు కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి.. ఆపై తండ్రి కూడా | Father Attempt To suicide With two Childrens In Medchal | Sakshi
Sakshi News home page

పిల్లలకు కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి.. ఆపై తాను కూడా

Oct 13 2019 8:11 AM | Updated on Oct 13 2019 8:23 AM

Father Attempt To suicide With two Childrens In Medchal - Sakshi

ప్రణీత్‌ (ఫైల్‌)... భార్య, పిల్లలతో సురేష్‌ (ఫైల్‌)

సాక్షి, మేడ్చల్‌( హైదరాబాద్‌) :  కన్న తండ్రే కుమారుల పాలిట కాలయముౖడయ్యాడు. కుమారులకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాపించాడు. అనంతరం తానూ తాగాడు. ఈ ఘటనలో చిన్న కుమారుడు మృతి చెందాడు. మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాజబొల్లారం తండాలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.  స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని రోడామేస్త్రినగర్‌కు చెందిన సురేష్‌ దంపతులు రాజబొల్లారం తండాలో నివాసముంటున్నారు. సురేష్‌ భార్య మంజుల తల్లిదండ్రులు రాజబొల్లారంలోనే ఉంటున్నారు. వీరికి ప్రదీప్‌(7),ప్రణీత్‌(5)కుమారులున్నారు. మద్యానికి బానిసైన  సురేష్‌ అత్తగారి ఇంట్లోనే ఉంటూ స్థానికంగా ఉన్న కంపెనీలో పనిచేస్తుండగా మంజుల కూడా కంపెనీలో పనిచేస్తోంది. సురేష్‌ ఆరు నెలల క్రితం అదే గ్రామంలోనే అద్దె ఇంట్లోకి మారాడు.  శుక్రవారం రాత్రి  మద్యం తాగి ఇంటికి వచ్చిన సురేష్‌ భార్యతో గొడవ పడ్డాడు.

దీంతో మంజుల నిద్రలో ఉన్న పిల్లలను  వదిలేసి సమీపంలో ఉన్న తల్లి వద్దకు వెళ్లిపోయింది.  కొద్ది సేపటికి మత్తులో ఉన్న సురేష్‌ కూల్‌డ్రింక్‌ తీసుకువచ్చి అందులో విష గుళికలు కలిపి  పడుకున్న చిన్నారులకు తాపించి తాను కూడా తాగాడు. పిల్లల్ని తీసుకువచ్చి మంజుల దగ్గర వదిలిపెట్టి అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. పిల్లలిద్దరూ పెద్దగా ఏడుస్తుండడం, గుళికల వాసన వస్తుండడంతో అనుమానం వచ్చిన మంజుల తన భర్తను నిలదీయగా విషయం చెప్పాడు.  వారిని వెంటనే మెడిసిటి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్న కుమారుడు ప్రణీత్‌(5) మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. ప్రదీప్‌(7) పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచనల మేరకు ప్రదీప్‌కు నగరంలోని నిలోఫర్‌ ఆస్పత్రికి, సురేష్‌ను గా«ంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా భన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని మంజుల పోలీసులను కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement