మేడారం జాతరకు వెళ్తుండగా.. | father and son killed in an accident | Sakshi
Sakshi News home page

మేడారం జాతరకు వెళ్తుండగా..

Jan 31 2018 2:02 PM | Updated on Sep 28 2018 3:39 PM

సాక్షి, తాడ్వాయి: జయశంకర్‌ జిల్లా తాడ్వాయి సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళుతున్న తండ్రీకొడుకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చెవిటిగూడెంకు చెందిన ఆటో డ్రైవర్‌ పి.అంజయ్య(50) తన కుమారుడు నవీన్‌(23)తో కలిసి ఆటోలో జాతరకు వెళ్తున్నాడు. తాడ్వాయి-పస్రా మధ్యలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాడ్వాయి ఎస్సై కరుణాకర్‌రావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement