దివ్య హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్‌ | Divya Assasination Case : RK Meena Says | Sakshi
Sakshi News home page

దివ్య హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్‌

Jun 9 2020 12:53 PM | Updated on Jun 9 2020 7:31 PM

Divya Assasination Case : RK Meena Says  - Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్య హత్యపై విశాఖ పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. దివ్య హత్యకేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. కాగా 2018లో వీరబాబు అనే వ్యక్తితో పెళ్లి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దివ్యతో పెళ్లి తర్వాత మూడు నెలల పాటు కాపురం చేసిన వీరబాబు వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చేవాడు. కాగా వీరబాబుకు దివ్య పిన్ని కాంతవేణి కూడా తోడయి ఆమెను ఒత్తిడికి గురి చేశారు. వీరి ఒత్తిడిని తట్టుకోలేకనే విశాఖపట్నంకు వచ్చిన దివ్య.. గీత, వసంత వద్దకు వచ్చినట్లు తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. కాగా హత్య సమయంలో నిందితులు దివ్య వద్ద సెల్‌ఫోన్‌ లేకుండా చేశారని తెలిపారు.
(పోలీసు కస్టడీకి దివ్య హత్య కేసు నిందితులు!)

విశాఖ పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ.. 'దివ్య హత్య కేసులో ఇప్పటి వరకు ఆరుగురు‌ నిందితులను అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు నిందితులని అరెస్ట్ చేయడానికి రెండు బృందాలతో గాలింపుచర్యలు చేపట్టాం. దివ్యకి గతంలో పెళ్లి జరిగినట్లు గుర్తించాం. నిందితులందరినీ పూర్తిస్ధాయిలో విచారించడానికి పోలీసు కస్టడీ కోరుతూ కోర్టులో పిటీషన్ వేస్తాం. దివ్యను అతి క్రూరంగా హింసించి హత్య చేశారు. దివ్య శరీరంపై అనేక గాయాలున్నాయి' అంటూ వివరించారు. (దివ్య హత్య కేసు: సంచలన నిజాలు)

Advertisement
 
Advertisement
Advertisement