తల్లిదండ్రులు మందలించారని.. | Degree Student Suicide Attempt In Khammam | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు మందలించారని..

Sep 2 2018 7:49 AM | Updated on Oct 8 2018 5:07 PM

Degree Student Suicide Attempt In Khammam - Sakshi

సారయ్య మృతదేహం

అశ్వారావుపేటరూరల్‌మహబూబ్‌నగర్‌: అతిగా మద్యం సేవిస్తున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో తట్టుకోలేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది, శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు...  మండలంలోని పాపిడిగూడేనికి చెందిన చిర్రా రవి(23) డిగ్రీ పూర్తి చేశాడు. కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి మందలించడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి కోసం ఆ రాత్రంతా కుటుంబీకులు గాలించినా ఆచూకీ తెలియలేదు. శనివారం ఉదయం గ్రామ సమీపంలోగల పంట పొలాల వద్ద రవి మృతదేహాన్ని స్థానికులు కొందరు గమనించి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. తల్లిదండ్రులు మందలించడంతో పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్థానికులు భావిస్తున్నారు. దీనిపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు చెప్పారు.

గుండాల: మద్యానికి బానిసగా మారిన ఆ యవకుడు.. తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహ త్య చేసుకున్నాడు. ఎస్సై శ్రావణ్‌ కుమార్‌ తెలిపిన వివరాలు... మండలంలోని తూరుబాక గ్రామాని కి చెందిన జోగ సారయ్య(22), ఇటీవల మద్యాని కి బానిసగా మారాడు. శుక్రవారం రాత్రి అతడిని తల్లిదండ్రులు మందలించారు. దీనిని తట్టుకోలేని అతడు, శనివారం ఉదయం గ్రామ సమీపంలోగల మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసును ఎస్సై కేసు శ్రావణ్‌ కుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement