ఫీజు డబ్బు కోసం చోరీ | Degree Student Chain Robbery For Fees | Sakshi
Sakshi News home page

ఫీజు డబ్బు కోసం చోరీ

Apr 5 2018 10:48 AM | Updated on Oct 1 2018 5:40 PM

Degree Student Chain Robbery For Fees - Sakshi

కర్నూలు:  డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థి టర్మ్‌ ఫీజు డబ్బు కోసం చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. నాల్గో పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడుమూరు మండలం అమడగుండ్ల గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌..కర్నూలులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీఎస్సీ(మ్యాథ్స్‌) ఫైనలియర్‌ చదువుతున్నాడు. ప్రతి రోజూ గ్రామం నుంచి కర్నూలు వచ్చేవాడు.

ఈ నెల 2వ తేదీ సాయంత్రం.. ఏపీఎస్‌పీ పదో బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ నర్సింహారెడ్డి భార్య మాధవి కర్నూలు ఆర్టీసీ బస్టాండులో బస్సు ఎక్కుతుండగా..ఆమె మెడలోని మూడు తులాల గొలుసును పవన్‌ కుమార్‌ చోరీ చేశాడు. అనుమానంపై పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. టర్మ్‌ ఫీజు చెల్లించేందుకు డబ్బు  లేకపోవడంతో చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో సదరు విద్యార్థిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement