రాష్ట్రపతి భవన్‌ క్వార్టర్స్‌లో కలకలం | Dead Body Found In Rashtrapati Bhavan Quarters | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి భవన్‌ క్వార్టర్స్‌లో కలకలం

Jun 8 2018 1:11 PM | Updated on Aug 21 2018 6:08 PM

Dead Body Found In Rashtrapati Bhavan Quarters - Sakshi

రాష్ట్రపతి భవన్‌ ఉద్యోగుల క్వార్టర్స్‌లో శుక్రవారం కలకలం రేగింది.

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌ ఉద్యోగుల క్వార్టర్స్‌లో శుక్రవారం కలకలం రేగింది. ఈ క్వార్టర్‌లో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మృతుడు రాష్ట్రపతి సచివాలయంలో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. మృతదేహం ఉన్న గది నుంచి వాసన రావడంతో సహఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో వారు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేయగా వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. అదేవిధంగా మృతుడి ఉన్న గదికి లోపలి నుంచి తాళం వేసి ఉన్నట్టు తెలిపారు.. ఆయన కొద్ది కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అయితే మృతుడి మరణానికి కారణాలేమిటో తెలియరాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement