అనుమానాస్పదంగా దంపతుల మృతి | Couple Suspicious death in Visakhapatnam | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా దంపతుల మృతి

Apr 12 2019 1:13 PM | Updated on Jul 10 2019 7:55 PM

Couple Suspicious death in Visakhapatnam - Sakshi

నందిని మృతదేహం ఉరి వేసుకొని మృతి చెందిన రాజేష్‌

చోడవరం టౌన్‌: గోవాడకు చెందిన భార్యాభర్తలు తమ సొంత ఇంటిలో అనుమానాస్పదంగా మృతి చెందారు.  దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.వివరాలు ఇలా ఉన్నాయి.  ఏడావాక రాజాష్‌(28),నందిని(24) భార్యాభర్తలు. వీరు గోవాడలో ప్రాథమిక పాఠశాల పక్కన తమసొంత ఇంటిలో నివాసముంటున్నారు. ఏమి జరిగిందో గాని  గురువారం ఉదయానికి భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. తెల్లవారినా ఎవరూ ఇంటిలోంచి బయటకురాక పోవడంతో పక్క ఇంటివారు వెళ్లి చూశారు.   రాజేష్‌ ఇంటి వరండాలో ఉరివేసుకొని మృతి చెంది ఉండగా, అతని భార్య నందిని ఇంటిలో మృతి చెంది ఉంది. అయితే రాజేష్‌ ఉరి వేసుకొని ఉన్నా, అతని రెండు చేతులు వెనకకు కట్టేసి ఉండం, నందిని తలకు, చేతిపై గాయాలై ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. రాజేష్‌ రోజు వారి కూలికి పని చేస్తూ ఉంటాడని, అయితే ఇటీవల తాగి భార్యతో తరచూ ఘర్షణ పడేవాడని స్థానికులు తెలిపారు.

దీంతో నందిని ఇటీవల వరకు తన అమ్మగారు ఊరైన వడ్డాది గ్రామంలో ఉండేదని, రెండు రోజుల క్రితమే గోవాడ వచ్చిం దని తెలిపారు. బుధవారం కూడా ఇద్దరూ ఘర్షణ పడ్డారని, తీరా తెల్లవారే సరికి ఇలా జరిగిందని అంటున్నారు.  భార్యాభర్తలు మధ్య ఘర్షణలో  ఆగ్రహం పట్టలేక భార్యని రాజేష్‌ హత్య చేసి ఉండవచ్చని, తరువాత  తాను కూడా ఉరి వేసుకొని మృతి చెంది ఉంటాడని తొలుత అందరూ అనుమానించారు. కానీ రాజేష్‌ చేతులు వెనక్కి కట్టేసి ఉండడం,   నంది తల,చేతిపై గాయాలండడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐలు రామకృష్ణ, మునాఫ్‌లు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.  పంచనామా చేసి మృత దేహా లను చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమారానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ తెలిపారు. రాజేష్, నందిలకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. తల్లి దండ్రులిద్దరూ  మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మారారు. గోవాడలో విషాదం అలముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement