చొప్పదండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు | Complaint on Choppadandi MLA | Sakshi
Sakshi News home page

చొప్పదండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు

Mar 12 2018 7:54 AM | Updated on Mar 12 2018 7:54 AM

Complaint on Choppadandi MLA - Sakshi

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తోన్న బాధితుడు

కరీంనగర్‌క్రైం: చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ అకారణంగా తనపై దాడి చేశారని పేర్కొంటూ రామడుగు మండలం తిర్మాలాపూర్‌కు చెందిన తడగొండ నర్సిం బాబు టూటౌన్‌ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. కరీంనగర్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ నివాసం వద్ద తాను, టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ సుంకే రవిశంకర్‌తో కలిసి ఉండగా.. అదే సమయంలో ఎమ్మెల్యే శోభ వచ్చారని, లిఫ్ట్‌ వద్ద ‘నన్ను కలువకుండా రవిశంకర్‌తో తిరుగుతావా..’ అంటూ అకారణంగా దుర్భాషలాడుతూ.. కుడిచెవి పట్టుకుని లాగి లిఫ్ట్‌లోకి తోశారని పేర్కొన్నారు.

ఆ తర్వాత గన్‌మెన్‌తో కలిసి ఎమ్మెల్యే తీవ్రంగా కొట్టారని తెలిపారు. వారినుంచి తప్పించుకుని లిఫ్ట్‌ నుంచి బయటకురాగా ‘నీ అంతుచూస్తా..’ అంటూ బెదిరించారని, ఎమ్మెల్యేతో తనకు ప్రాణభయం ఉందని కరీంనగర్‌ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేశ్‌గౌడ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement