ఘోర రోడ్డు ప్రమాదం: పదిమంది మృతి | Bus And Truck Collide in Madhya Pradesh Rewa | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: పదిమంది మృతి

Dec 5 2019 9:54 AM | Updated on Dec 5 2019 10:01 AM

Bus And Truck Collide in Madhya Pradesh Rewa - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుకనుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు సిద్ధి నుంచి రేవాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నంది. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సమయంతో సహాయ చర్యలను చేపట్టారు. కాగా ‍ప్రమాదానికి బస్సు అతివేగమే కారణమని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement