
బాలుడి మృతదేహం
లంగర్‌హౌస్: ఓ బాలుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లంగర్‌హౌస్ ఫ్లోర్‌మిల్‌కు చెందిన అఫ్రోజ్ కుమారుడు అస్లాం(13) ఎండీలైన్స్‌లోని మదర్సాలో చదువుతున్నాడు.
మంగళవారం ఉదయం మదర్సాకు వెళుతున్నట్లు చెప్పి వెళ్లిన అతను సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి ఆరా తీశారు. అతను మదర్సాకు రాలేదని నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా. ఇంటి సమీపంలో ని పాత ఫ్లోర్‌మిల్‌లోని ఓ గదిలో అతని మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. అడిషనల్ సీపీ చౌహాన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
లైంగిక దాడి చేసినట్లు అనుమానం
బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం అతడి గొంతుకు రబ్బరు పైపుతో బిగించి ఉరి వేసి చంపినట్లు పోలీసులు భాస్తున్నారు. పాత గొడవలను దృష్టిలో ఉంచుకుని తెలిసివారే ఉన్న ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చుననే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.