తెలుగు గంగలో పడి విద్యార్థి గల్లంతు | boy missing in Telugu Ganga | Sakshi
Sakshi News home page

తెలుగు గంగలో పడి విద్యార్థి గల్లంతు

Jan 20 2018 5:30 PM | Updated on Jul 12 2019 3:29 PM

సాక్షి, బుచ్చినాయుడుకండ్రిగ : చిత్తూరుజిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంకాటూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పండుగకు అక్క ఇంటికి వచ్చిన ఓ బాలుడు తెలుగుగంగ మెయిన్‌ కాలువలో పడి గల్లంతయ్యాడు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఏఎంపుత్తూరుకు చెందిన నాదముని కుమారుడు సాయి (15) పదో తరగతి చదువుతున్నాడు. పండుగకు కాటూరు గ్రామం అరుంధతివాడలోని అక్క ఇంటికి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం తెలుగుగంగ కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లగా కాలు జారి నీటిలో పడిపోయాడు. ఇది గమనించిన మరో యువకుడు ఇంటికెళ్లి సమాచారమందించగా సాయి కోసం స్థానికులు కాలువలో గాలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. శనివారం గజ ఈతగాళ్లు వచ్చి గాలించినా ఫలితం లేకపోయింది. బంధువులు కాలువ వద్దనే ఉండి అతడి కోసం వేచి చూస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రామ్‌మోహన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement