కుక్క తెచ్చిన తంటా.. | Bike Accident Two Army Jawans Injured In Chittoor | Sakshi
Sakshi News home page

కుక్క తెచ్చిన తంటా..

Jun 28 2018 12:07 PM | Updated on Sep 29 2018 4:26 PM

Bike Accident Two Army Jawans Injured In Chittoor - Sakshi

మదనపల్లె క్రైం: కుక్క అడ్డురావడంతో బైక్‌ అదుపు ఇద్దరు మిలటరీ ఉద్యోగులు తీవ్రంగా గాయపడి న ఘటన మంగళవారం రాత్రి గుర్రంకొండ మం డలంలో జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దమండ్యం మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన వి.సంతోష్‌ కుమార్‌రెడ్డి(23),  వి.కృష్ణకిరీటి రెడ్డి(24) మిలటరీలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా వీరిద్దరు సెలవుపై రెండు రోజులక్రితం స్వగ్రామంలో ఉన్న తల్లిదండ్రులను చూడటానికి వచ్చారు. మంగళవారం మధ్యహ్నం గుర్రంకొండలో వారి స్నేహితులను చూడానికి బైక్‌లో వెళ్లారు. తిరిగి రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో  తురకపల్లె వద్దకు రగానే ఓ కుక్క బైక్‌కు అడ్డు రావడంతో బైక్‌ అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న వీరిని స్థానికుల సాయంతో 108 సిబ్బంది మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తిరుపతికి రెఫర్‌ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

1
1/1

గాయపడిన సంతోష్‌ కుమార్‌రెడ్డి, కృష్ణకిరీటిరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement