ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం  | Attempt to rape a seven-year-old child | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం 

Apr 5 2018 10:32 AM | Updated on Oct 9 2018 5:39 PM

Attempt to rape a seven-year-old child - Sakshi

నిందితుడిని చూపుతున్నపోలీసులు

మిరుదొడ్డి(దుబ్బాక): ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన చెప్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని లింగుపల్లిలో జరిగింది. ఘటనపై సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌ విచా రణ చేపట్టారు. బుధవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..గ్రామానికి చెందిన పెద్దలింగన్న గారి శేఖర్‌(25)  రెండో తరగతి చదువుతున్న చిన్నారి(07)కి చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో చిన్నారి కేకలు వేసింది.

చుట్టు పక్కల ఉన్న వారి అలికిడి మొదలు కావడంతో శేఖర్‌ పారిపోయాడు. చిన్నారి ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం సిద్దిపేట మాతాశిశు ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.  ఏసీపీ వెంట దుబ్బాక సీఐ నిరంజన్, ఎస్‌ఐ విజయభాస్కర్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement