పీడీఓ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడి | ACB rides on PDO house | Sakshi
Sakshi News home page

పీడీఓ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడి

Jan 4 2018 3:52 PM | Updated on Aug 17 2018 12:56 PM

సాక్షి, నెలమంగల(దొడ్డబళ్లాపురం):  నెలమంగల పట్టణంలో పీడీఓ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. గురువారం వేకువజామున వాజరహళ్లి గ్రామ పంచాయతీ పీడీఓ రేఖ ఇంటికి వెళ్ళిన ఏసీబీ అధికారులు తనిఖీలు నిర‍్వహించారు.
ఏసీబీ డీఎస్పీ కోదండరాం ఆధ్వర్యంలో ఇద్దరు డీవైఎస్పీలు, నలుగురు ఇన్‌స్పెక్టర్‌లు,14 మంది సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. నెలమంగల పట్టణంలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో పీడీఓ రేఖ అద్దె ప్లాట్‌ లో నివసిస్తున్నారు. ఇటీవల రేఖ అవినీతిపై పంచాయతీ సభ్యులు, గ్రామస్తులు పలుసార్లు ధర్నాలు చేశారు.

పీడీఓ రేఖ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని పలువురు ఏసీబీకి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది. పీడీఓ ఇంట్లో కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున‍్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement