ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి | 6 years old girl sexual assaualt | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి

Jan 15 2018 6:00 PM | Updated on Oct 4 2018 8:29 PM

సాక్షి, మదనపల్లి: చిత్తూరుజిల్లా మదనపల్లిలోని ఎస్‌బీఐ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. రాజస్థాన్‌ నుంచి పొట్ట చేతబట్టుకుని వచ్చిన ఓ కుటుంబంలోని ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో మదనపల్లికి వచ్చి బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటూ స్థానిక ఎస్ బి ఐ కాలనీలో రోడ్డు పక్కన గుడారం వేసుకుని ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి దగ్గర ఎవరూ లేని సమయంలో బెంగళూరుకు చెందిన గంగాధర(42) అనే వ్యక్తి అటుగా వచ్చాడు. అక్కడున్న 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న స్థానికులు గమనించి గంగాధరకు దేహశుద్ధి చెయ్యగా అతను పరారయ్యాడు. మదనపల్లి 2వ పట్టణ పోలీసు స్టేషన్‌లో నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement