సాఫ్ట్‌వేర్ ఉద్యోగి‌ కుటుంబం ఆత్మహత్య! | 4 Family Members Last Breath At Almasguda In Hyderabad | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య!

Apr 22 2020 7:56 PM | Updated on Apr 22 2020 8:12 PM

4 Family Members Last Breath At Almasguda In Hyderabad - Sakshi

తలుపులు బద్దలు కొట్టి చూడగా.. నలుగురు విగతజీవులుగా కనిపించారు.

సాక్షి, హైదరాబాద్‌: మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్మాస్‌గూడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. మృతుల్ని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హరీష్‌ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో నివాసముంట్ను హరీష్‌ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో.. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా.. నలుగురు విగతజీవులుగా కనిపించారు. మృతులను హరీష్‌, స్వప్న గిరీష్‌, సువర్ణగా పోలీసులు గుర్తిచారు. ఆర్థిక  ఇబ్బందులతో నలుగురూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.
(చదవండి: కరోనా: ఇకపై 28 రోజుల హోం క్వారంటైన్‌)

Advertisement
 
Advertisement
Advertisement