సాధువుల హత్య కేసును ఛేదించిన పోలీసులు

2 Sadhus Assassination Case Police Arrested Accused - Sakshi

లక్నో : ఉత్త‌రప్ర‌దేశ్‌లో కలకలం రేపిన శివాలయంలో సాధువుల హత్య కేసును పోలీసులు ఒక్క రోజులోనే ఛేదించారు. మంగళవారం ఈ జంట హత్యలతో సంబంధం ఉన్న మురారీ అలియాస్‌ రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సాధువులతో జరిగిన గొడవ కారణంగానే అతడు వారిని హత్య చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. బంగు మత్తులో శివాలయంలో పడుకుని ఉన్న సాధువులపై కర్రలతో దాడి చేసి చంపినట్లు వెల్లడించారు. అయితే పోలీసుల విచారణలో మొదట తనకు సాధువులకు ఎటువంటి గొడవ జరగలేదని, దేవుడు కోరినందుకే రెండు హత్యలు చేశానని రాజు చెప్పడం గమనార్హం. అనంతరం పోలీసులు గట్టిగా ప్రశ్నించటంతో అతడు చేసిన నేరం ఒప్పుకున్నాడు. కాగా, సోమవారం రాత్రి బులందర్‌షహర్‌జిల్లా ప‌గోనా గ్రామంలోని శివా‌యం లోప‌ల జగదీష్‌‌, షేర్‌ సింగ్‌‌ అనే ఇద్ద‌రు సాధువులు హత్యకు గురయ్యారు. ( శివాల‌యంలో సాధువుల దారుణ హ‌త్య‌ )

గుడి దగ్గర గుమికూడిన జనం

పోలీసుల దర్యాపులో ఆ ఇద్దరు సాధువులు రెండు రోజుల క్రితం రాజుతో గొడవపడ్డారని తెలిసింది. గొడవ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. రాజు గురించి విచారించగా.. హత్య జరిగిన రోజు రాత్రి అతడు కత్తితో ఊరిబయట కనిపించాడని తెలిసింది. దీంతో పోలీసులు రాజు కోసం గాలించి ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో అర్థనగ్నంగా.. మత్తులో తూగుతున్న అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. (విషాదం: మంటలు ఆర్పేందుకు వెళ్లి..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top