మరో దారుణం: ఇద్ద‌రు సాధువుల హ‌త్య‌

Two Sadhus Killed Inside Temple At Bulandshahr In Uttar Pradesh - Sakshi

లక్నో: మ‌హారాష్ట్ర‌లోని పాల్గ‌రిలో సాధువుల హ‌త్య ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మ‌రో ఇద్ద‌రు సాధువులు హ‌త్య‌కు గురయ్యారు. ఈ దారుణ ఘ‌ట‌న‌ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బులంద్‌ష‌హర్‌లోని ప‌గోనా గ్రామంలో శివా‌యం లోప‌ల ఇద్ద‌రు సాధువుల‌ను‌ గుర్తు తెలియ‌ని దుండ‌గులు ప‌దునైన ఆయుధాల‌తో అతి కిరాత‌కంగా హ‌త‌మార్చారు. సోమ‌వారం నాడు ఈ ఘ‌ట‌న జ‌రిగివుండవ‌చ్చ‌ని భావిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ఆల‌యానికి వ‌చ్చిన కొందరు గ్రామ‌స్తులు ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న సాధువుల‌ను గుర్తించి పోలీసుల‌కు సమాచార‌మిచ్చారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (విషాదం: మంటలు ఆర్పేందుకు వెళ్లి..)

మృ‌తి చెందిన సాధువుల‌ను జ‌గ‌దీష్‌‌(55), షేర్‌ సింగ్‌(46)‌గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై బులంద్‌ష‌హ‌ర్ ఎస్ఎస్ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "ఇటీవ‌లే ఇద్ద‌రు సాధువుల‌కు ఓ వ్య‌క్తితో గొడ‌వ జ‌రిగింది. అత‌ను వీరి వ‌స్తువులు దొంగిలించేందుకు ప్ర‌య‌త్నించే క్ర‌మంలో వారి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఆ కోపంతోనే అత‌ను వాళ్లిద్ద‌రినీ చంపేసి ఉండ‌వ‌చ్చ‌‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద"‌న్నారు. ప్ర‌స్తుతం స‌ద‌రు నిందితుడిని అరెస్ట్ చేసి విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. కాగా మ‌హారాష్ట్రలోని పాల్ఘ‌ర్‌లో ఇద్ద‌రు సాధువుల‌తోపాటు ఓ డ్రైవ‌ర్‌ను అతి దారుణంగా హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. (మూకహత్య: ఉద్ధవ్‌ ఠాక్రేకు అమిత్‌ షా ఫోన్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top