రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌ | Xiaomi to launch Rs 4.8 lakh smartphone today | Sakshi
Sakshi News home page

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

Jul 17 2019 11:06 AM | Updated on Jul 17 2019 12:52 PM

Xiaomi to launch Rs 4.8 lakh smartphone today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్‌​ కంపెనీ షావోమి మరో సంచలనానికి శ్రీకారం  చుట్టింది.  ఎప్పటినుంచో ఊరిస్తున్న కే అంటే కిల్లర్ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి కే 20 ప్రొ పేరుతో వరల్డ్స్‌ ఫాస్టెస్ట్‌ ఫోన్‌ను నేడు ఇండియాలోకి తీసుకురానుంది. ఢిల్లీలో నిర్వహించనున్న ఈ లాంచ్‌  ఈవెంట్‌లో మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉంది. రెడ్‌మి కే 20, రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్లతోపాటు స్పెషల్‌ ఎడిషన్‌ను కూడా లాంచ్‌ చేయనుంది. దీని ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.4.8 లక్షలు. అవును ఈ ధరను స్వయంగా షావోమి ఇండియా ప్రెసిడెంట్‌ మనుకుమార్‌ జైన్‌ ట్విటర్‌లో వెల్లడించారు. గోల్డ్‌ అండ్ డైమండ్‌ ఎడిషన్‌గా  దీన్ని ఆవిష్కరించనున్నారు. ఇక బ్లూ,రెడ్‌, బ్లాక్‌ రంగుల్లో లభ్యం కానున్న రెడ్‌మికే 20 ప్రొ బేస్ (‌6జీబీ, 64జీబీ స్టోరేజ్‌) వేరియంట్‌ ధర రూ. 24,900 నుంచి ప్రారంభంకానున్నాయని అంచనా.

ధరల అంచనాలు
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ రూ. 25,900
8 జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ రూ. 27,900
6 జీబీ ర్యామ్‌ , 256 జీబీ స్టోరేజ్‌ రూ. 29,900

కే 20  ప్రొ  ఫీచర్లు
6.39 ఫుడ్‌ హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే
1080x2340 పిక్సెల్స్‌రిజల్యూషన్
‌48+13+8 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
13+8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

Advertisement
 
Advertisement
Advertisement