టాటా సూచనపై తగు నిర్ణయం | Sakshi
Sakshi News home page

టాటా సూచనపై తగు నిర్ణయం

Published Tue, Feb 23 2016 1:37 AM

టాటా సూచనపై తగు నిర్ణయం

5/20 నిబంధనపై కేంద్ర మంత్రి మహేశ్ శర్మ
న్యూఢిల్లీ: దేశీ ఎయిర్‌లైన్స్ విదేశాలకు విమానాలు నడిపే నిబంధనలకు సంబంధించి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అభిప్రాయాలను స్వాగతిస్తున్నట్లుగా పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. దీనిపై తగు సమయంలో నిర్ణయం తీసుకోగలమని ఆయన తెలిపారు. విదేశాలకు ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించాలంటే భారత విమానయాన సంస్థలు అయిదేళ్ల పాటు దేశీ రూట్లలో సర్వీసులు అందించడంతో పాటు 20 విమానాలు ఉండాలన్న నిబంధనపై (5/20) వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్త కంపెనీల నుంచి పోటీకి భయపడి పాత సంస్థలు గుత్తాధిపత్యంతో ఈ నిబంధనను ఎత్తివేయకుండా ఒత్తిడి తెస్తున్నాయంటూ రతన్ టాటా పరోక్షంగా వ్యాఖ్యానించడం తాజాగా వివాదం రేపింది. కొత్తగా ఏర్పాటైన ఎయిర్‌ఏషియా ఇండియా, విస్తార సంస్థల్లో టాటా గ్రూప్‌నకు వాటాలు ఉన్నాయి.

Advertisement
Advertisement