4జీ ఫోన్లపై వొడాఫోన్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ | Vodafone to offer Rs 2,200 with Tecno smartphones | Sakshi
Sakshi News home page

4జీ ఫోన్లపై వొడాఫోన్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

Mar 14 2018 12:43 PM | Updated on Mar 14 2018 12:43 PM

Vodafone to offer Rs 2,200 with Tecno smartphones - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ వొడాఫోన్  ఇండియా ఆకర్షణీయమైన  ఆఫర్‌ ప్రకటించింది. ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీకి చెందిన 4జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు 2,200 రూపాయల వరకు  క్యాష్‌బ్యాక్‌  ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు తమ మధ్య ఒక అంగీకారం కుదిరిందని ఇరు సంస్థలు మంగళవారం  ఒక  ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

రూ. 6,990 - రూ.14,990 మధ్య టెక్నో ఐ సిరీస్‌  మొబైల్స్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు  ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.  ఈ ఆఫర్ పొందేందుకు కస్టమర్లు  మార్చి 14వ తేదీనుంచి జూన్ 30, 2018 వరకు ఈ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలి. అయితే పాత, కొత్త  ప్రీపెయిడ్‌ కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందాలంటే  నెలకు రూ.150 చొప్పున 18నెలలపాటు రీచార్జ్‌ చేసుకోవాలి. పిదప మొదటి విడతగా రూ.900, మరో 18నెలలపాటు రూ.150 రీచార్జ్‌పై  మిగిలిన రూ.1300 క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తుంది.  ఈ మొత్తం నగదును  వోడాపోన్‌ ఎం-పైసా వాలెట్‌లో  జమ చేస్తుంది. దీంతోపాటు  వోడాఫోన్ ప్లే 3నెలల సభ్యత్వం  ఉచితం.  తద్వారా టెక్నో కస్టమర్లు అన్‌ లెమిటెడ్‌ ప్రీమియం వీడియో కంటెంట్‌ను పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement