ఐటెల్‌ నుంచి బడ్జెట్‌ ఫోన్‌ విజన్‌–1 | Vision 1 Budget Smartphone From Itel | Sakshi
Sakshi News home page

ఐటెల్‌ నుంచి బడ్జెట్‌ ఫోన్‌ విజన్‌–1

Feb 18 2020 8:00 AM | Updated on Feb 18 2020 8:00 AM

Vision 1 Budget Smartphone From Itel - Sakshi

న్యూఢిల్లీ: ట్రాన్సియాన్‌ ఇండియా ఐటెల్‌ బ్రాండ్‌పై విజన్‌–1 స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. 6.088 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లేతో కూడిన ఈ ఫోన్‌ధర రూ.5,499. ఫోన్‌తో పాటు రూ.799 విలువ చేసే ఐటెల్‌ బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ కూడా ఉచితంగా లభిస్తుంది. దీనికి అదనంగా ఇన్‌స్టంట్‌గా రూ.2,000 వరకు క్యాష్‌ బ్యాక్, 25జీబీ జియో డేటా ఆఫర్లు ఉన్నట్టు కంపెనీ తెలిపింది. 2.5డీ కర్వ్‌డ్‌ లామినెటెడ్‌ డిస్‌ప్లే, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఏఐ డ్యుయల్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్, ఫేస్‌ అన్‌లాక్, 1.6 గిగాహెర్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ సామర్థ్యాలున్నాయి. గ్రాడేషన్‌ బ్లూ, పర్పుల్‌ రంగుల్లో లభిస్తుంది.  

Advertisement
 
Advertisement
Advertisement